Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జూరాల ప్రాజెక్ట్‌..32గేట్లు ఎత్తివేత

వరదనీటితో జూరాల ప్రాజెక్ట్‌ కళ కళలాడుతోంది. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరదతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం జూరాలలోకి చేరుతోంది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం ప్రాజెక్టుకు నుంచి 1.56 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.826 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది. జూరాల పూర్తి నీటినిల్వ 9.65 టీఎంసీలుకాగా ఇప్పుడు 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img