Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు : రాహుల్‌గాంధీ

తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి దోస్తీ ఉండదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని..ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండొద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయమని, దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నా తమకేమీ అభ్యంతరంలేదని అన్నారు. కేసీఆర్‌ అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందిస్తూ, ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు దోచుకునే పనిలో ఉన్నాయని అన్నారు. మోదీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగానే భారత్‌ జోడో యాత్ర చేపట్టానని, తనతో లక్షల మంది నడుస్తున్నారని రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. పాదయాత్ర ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. గతంలో తన తండ్రి రాజీవ్‌ గాంధీ చార్మినార్‌ నుంచి యాత్ర చేశారని, ఇప్పుడు అక్కడి నుంచి తాను భారత్‌ జోడో యాత్ర చేస్తున్నానని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img