Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాకింగ్‌ కేసు..నిర్లక్ష్యంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి : సీవీ ఆనంద్‌

మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాకింగ్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌..పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మీడియాకు వెల్లడిరచారు. కేసులో 2 నెలల పాటు విచారణ చేసినట్టు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. 100 మంది పోలీస్‌ ఆఫీసర్స్‌తో కేసు విచారణ చేశామన్నారు. ఏ కేసుకు ఖర్చు కానీ నగదు, మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ఖర్చు అయ్యిందన్నారు. టీఏ, డీఏలతో కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యిందని సీపీ తెలిపారు. హ్యాకింగ్‌ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుతున్నా కూడా నిబంధనలు పాటించక పోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img