Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

డ్రోన్‌ టెక్నాలజీతో ప్రపంచానికి కొత్త కాంతి

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య
డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వికారాబాద్‌లో డ్రోన్‌ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడిరచారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు.మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని అన్నారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే భయపడతారని వెల్లడిరచారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయవచ్చన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్‌ వర్సిటీగా మార్చాలని కేంద్ర మంత్రిని సింధియాను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img