Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

తాండూరులో టెన్త్ పేపర్ లీక్.. పోలీసుల అదుపులో టీచర్ ..

పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే పేపర్ లీకైంది. నేటి ఉదయం 9.40గంటలకు వాట్సప్ లో ప్రశ్నాపత్రం వైరల్ అవుతుండడంతో కలకలం రేగింది. వెంటనే పేపర్ లీకేజీ సమాచారాన్ని పోలీసులకు, అధికారులకు కొందరు తెలియజేశారు. దీంతో స్పందించిన అధికారులు, పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తాండూరులో స్థానికంగా ఉండే వన్ స్కూల్ నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్లుగా గుర్తించారు. ఆ స్కూలుకు చెందిన టీచర్ బందెప్ప 9.30గంటలకు ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వాట్సప్ గ్రూప్ ద్వారా బయటకు చేరవేసినట్లు పోలీసులు తేల్చారు. వెంటనే బందెప్పను అదుపులోకి తీసుకొని, అతన్ని విచారిస్తున్నారు. వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం ఎవరెవరికి చేరిందనే విషయాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ప్రశ్నాపత్రం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లలేదని, అలాగే ఏ విద్యా సంస్థకు చేరలేదని ప్రాథమికంగా గుర్తించారు. ప్రశ్నాపత్రం వైరల్ అవుతున్న విషయాన్ని నిమిషాల వ్యవధిలో పోలీసులకు చేరడం, వెంటనే స్పందించడంతో ఆ ప్రశ్నాపత్రం ఎవరిచేతుల్లోనూ పడలేదని అంటున్నారు. దీనిపై విద్యా శాఖ కూడా అధికారికంగా అంతర్గత దర్యాప్తును ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img