Friday, April 19, 2024
Friday, April 19, 2024

తిరుపతికి ఎనిమిది ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకొని ఈ నెల 30 నుంచి నాందేడ్‌-తిరుపతి, తిరుపతి, ఔరంగాబాద్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాందేడ్‌-తిరుపతి (రైలు నంబర్‌ 07633) మధ్య ఈ నెల 30న ప్రత్యేక రైలు నడుస్తుందని తెలిపింది. రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని పేర్కొంది. తిరుపతి -నాందేడ్‌ (07634) మధ్య ఈ నెల 31న రాత్రి 9.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుందని తెలిపింది. తిరుపతి ఔరంగాబాద్‌ (07637) మధ్య ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 7, 14, 21 తేదీల్లో నడుస్తుందని తెలిపింది. రైలు ఉదయం 7 గంటలకు ఔరంగాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 11 గంటలకు చేరుకుంటుందని తిరుపతి పేర్కొంది. ఔరంగాబాద్‌ – తిరుపతి (07638) మధ్య ఆగస్ట్‌ 8, 15, 22 తేదీల్లో నడువనుండగా.. రాత్రి 11.05 గంటలకు ఔరంగాబాద్‌లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img