Friday, April 19, 2024
Friday, April 19, 2024

తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశాం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి

: మంత్రి హరీశ్‌రావు
వ్యవసాయ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూర్‌ మండలం చందలాపూర్‌ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన్‌ రోజా శర్మతో కలసి తుంపర సేద్య పరికరాలు, ప్రొసీడిరగ్‌ కాపీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..దేశంలోని గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని,కానీ తెలంగాణలో కరెంట్‌ కోతలు లేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒక్క యూనిట్‌ కు రూ.20 రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగా నిరంతర కరెంటు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు ఆరుతడి, వాణిజ్య పంటలు పండిరచి లాభాలు పొందాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని రైతులకు 4 వేల తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img