Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలంగాణకు మళ్లీ భారీవర్ష సూచన

భారీవర్షాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటుండగా ఈ నెల 18 నుంచి మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.భారీ వర్షాలతో వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. గురువారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టగా అనేక జిల్లాలను వరద ముప్పు వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం మధ్యాహ్నానికి అక్కడ గోదావరి నీటిమట్టం 69 అడుగులకు చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీవర్షాలు తెరిపినివ్వడంతో అధికారులంతా సహాయకార్యక్రమాల్లో నిమగ్నం కాగా.. వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.ఈ నెల 18 తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. అనేక జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జయశంకర్‌ జిల్లా రేగులగూడెం, మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img