Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణను అవమానించే హక్కు పీయూష్‌ గోయల్‌కు లేదు : హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతుల్ని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మరోసారి అవమానించారని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణను అవమానించే హక్కు పీయూష్‌ గోయల్‌కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి తెలంగాణ నుంచే అవసరమైన 60 శాతం విత్తనాలు సరఫరా అవుతున్నాయన్నారు. పంజాబ్‌ బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా అని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ మరోసారి అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేయటాన్ని మంత్రి హరీష్‌ రావు ఖండిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మ హత్యలు ఉండేవని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక పథకాలు తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే వస్తుందన్నారు. దేశంలో 80 శాతం సీడ్‌ను తెలంగాణలో తయారు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇది సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. పంటల సాగును ఇతర రాష్ట్రాలతో పోల్చటం సరికాదన్నారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ తెలంగాణలో ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఈడీ, ఐటీ దాడులు చేస్తామని బెదిరించే సంస్కృతి బీజేపీదని ఆయన మండిపడ్డారు.అవసరం అయితే తాము నూకలు తింటామని, మిమ్మల్ని గద్దె దించేవరకు ఉద్యమిస్తామన్నారు. పీయూష్‌ గోయల్‌ పదేపదే తెలంగాణ ప్రజలను, రైతులనుఅవమాన పరుస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img