Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణలో పెరుగుతోన్న చలి

తెలంగాణలో చలి మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల దట్టంగా పొగమంచు కురుస్తున్నది. చలిగాలులు భారీగా వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రతకు జనం వణికిపోతున్నారు. పలు చోట్ల రోడ్లను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తర భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో శీతలగాలులు తెలంగాణ వైపు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతోందని, . ఈ నెల 27వ తేదీ వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరశాఖ హెచ్చరించింది. కాగా బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెదరిలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 5.8, బేల 5.9, అర్లి(టీ)లో 5.9, సిర్పూర్‌(యూ) 6, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ జన్నారం, బజార్‌హత్నూర్‌ 6.1, వాంకిడి 6.1, రవీంద్రనగర్‌ 6.1లో , ముత్తారం మహదేవ్‌పూర్‌ 6.5లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img