Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలంగాణలో బీజేపీ కుట్రలు చెల్లవు.. మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో బీజేపీ కుట్రలు చెల్లవని.. మునుగోడు ప్రజలు బీజేపీకి చెప్పుతో సమాధానం చెప్పారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జనగామలో మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రితో పాటు స్టేషన్‌ ఘన్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అవసరం లేని ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇచ్చి రాజగోపాల్‌ రెడ్డిని కొనుగోలు చేసి ఈ ఎన్నికల్లో బలిపశువును చేశారన్నారు. ఎన్నికల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు.గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఆంధ్రలో కలిపిన ఏడు మండలాలు, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజనుల యూనివర్సిటీ అమలు చేయలేని బీజేపీ రాష్ట్రంలో మాయమాటలు చెబుతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుండి పన్నుల రూపేనా కేంద్రానికి మూడు లక్షల 75 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని.. అందుకుగాను రాష్ట్రానికి రెండు లక్షల 50 వేల కోట్లు నిధులు ఇవ్వడం జరిగిందని, మిగతా నిధులు తేవడంలో బీజేపీ కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా భవిష్యత్తులో బీజేపీ మతోన్మాదం ఉచ్చులో పడి యువత మోసపోవద్దని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ముందుకు పోదామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img