Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు

11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణలో మరో మూడురోజులు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసిన అధికారులు… ఆయా జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉత్తర ఒడిశా, చత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపునకు తిరిగి ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీనపడినట్లు వెల్లడిరచారు.వీటికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళ, బుధవారాల్లో కూడా ఇవే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదుల పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి 82,740 క్యూసెక్కుల వరద వస్తుండగా 18 గేట్లను ఎత్తి 74,952 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిరది. కాళేశ్వరం వద్ద గోదావరి 10.89 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. శ్రీశైలం వద్ద కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఒక గేటుద్వారా 53,672 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి, ఎత్తిపోతలకు 77,736 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img