Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణలో రేపు ‘పల్స్‌ పోలియో’

వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రేపు తెలంగాణవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికిపైగా పిల్లలకు చుకలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలవరకు చుక్కలు వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు చుక్కలు వేయనున్నారు. ఆ తర్వాత రెండు రోజులపాటు సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వియజవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img