Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

తెలంగాణలో వారం పాటు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.

.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ప్రజలు డయల్‌ 100కు కాల్‌ చేయాలని తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, మంచిర్యాల, కరీంగనర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడా.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిరచారు. ఈరోజు నుంచి 12 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచే వర్షాలు కురిశాయి. ఉప్పల్‌, పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img