Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణాలో లంపీ స్కిన్‌ కలకలం

తెలంగాణ రాష్ట్రంలో లంపీ స్కిన్‌ వ్యాధి కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పశువులు లంపీ స్కిన్‌ వ్యాధి బారిన పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల్‌తో పాటు అనేక జిల్లాలలో పశువులలో లంపి స్కిన్‌ వ్యాధి కనిపిస్తుంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లజాతి పశువులలో ఎడ్లు, ఆవులు వంటి వాటిలో లంపీ స్కిన్‌ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పాడి పశువుకు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో పాడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 57 పాడి పశువుల లంపీ స్కిన్‌ వ్యాధి సోకింది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం లో 22 పశువులకు లంపీ స్కిన్‌ వైరస్‌ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇక నిజామాబాద్‌ జిల్లాలోని తుంగిని, నలేశ్వర్‌ గ్రామాలలో ఐదు ఆవులకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఎల్లారెడ్డిపేట లో ఒక లేగ దూడ, గద్వాల జిల్లాలో మూడు ఎద్దులు ఈ వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తుంది. అంతేకాదు నిర్మల్‌ జిల్లాలో టాక్లి, బాబుల్‌ గాం, కమోల్‌ లో కూడా పశువులు లంపీ స్కిన్‌ బారిన పడినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img