Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలంగాణ కోరుతున్నట్టు..కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాద‌న్న టైబ్యున‌ల్

తెలంగాణ కోరుతు న్నట్టు- కృష్ణా జలాల పున:పంపిణీ సాధ్యం కాదని కృష్ణా జల వివా దాల -టైబ్యునల్‌-2 (బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌) స్పష్టం చేసిం ది. దీంతో బచావత్‌ -టైబ్యునల్‌ (కృష్ణా జల వివాదాల -టైబ్యునల్‌-2) ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన కృష్ణా జలాల పున:పంపిణీ పై ఎంతో కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్టయింది. బచావత్‌ -టైబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన 811 టీ-ఎంసీల పైనా..రాష్ట్ర పునర్విభజన సందర్భంగా 811 టీ-ఎంసీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్ర కేటాయిం పులపైనా పున:సమీక్ష చేసే అవకాశమే లేదనీ, కృష్ణాలో 65 శాతం నీటి లభ్యతపై ఒనగరూరే అదనపు జలాల పంపిణీపైనే దృష్టి పెడతామని తేల్చి చెప్పింది. ఏపీ ఎప్పటి నుంచో ఇదే వాదన వినిపిస్తున్నా తెలంగాణ మాత్రం ససే మిరా అంటోంది. కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతి పదికన పున:పంపిణీ చేయాలని పట్టు-బడుతోంది. ఈ వాదన సాంకేతికంగా, న్యాయపరంగా, చట్టబద్దంగా సాధ్యం కాదని ఏపీ చేస్తున్న వాదనలకు ఇపుడు బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ నిర్ణయం బలం చేకూర్చినట్టయింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా కేవలం తాగునీటి ప్రాజెక్టుగా చూపెడుతూ పాల మూరు-రంగారెడ్డి పేరుతో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మా ణం చేస్తుండటమే కాకుండా కృష్ణా నుంచి 90 టీ-ఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ జల వనరుల శాఖ ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ (ఐఏ) రూపంలో -టైబ్యునల్‌ కు ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ కృష్ణా జలాల పున:పంపిిణీపై కీలక వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img