Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలంగాణ ప్రజలకు బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న కరెంట్‌ బిల్లు

తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ పంపిణీ సంస్థల(డిస్కం)లు షాక్‌ ఇచ్చాయి. కరెంట్‌ బిల్లులో ఇంధన ధర సర్దుబాటు ఛార్జీను అదనంగా వసూలు చేసేందుకు రెడీ అయ్యాయి. రాష్ట్రంలో మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కరెంట్‌ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంటుంది. అందుకే ఎఫ్‌సీఏ ఛార్జీలను విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఆమోదం తెలిపింది. విద్యుత్‌ వినియోగదారులపై మరింత భారం వేసేందుకు డిస్కంలు సిద్దమయ్యాయి. ఛార్జీలను పెంచకుండా ఇంధన ధర సర్దుబాటు ఛార్జీల రూపంలో కరెంట్‌ బిల్లులో అదనంగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కరెంట్‌ బిల్లులలో ఈ ఛార్జీలను కలపాలని నిర్ణయించాయి. యూనిట్‌పై 30 పైసలు ఎఫ్‌సీఏ వసూలు చేయాలని భావిస్తున్నాయి. ఇంధన, బొగ్గు ధరల ఆధారంగా యూనిట్‌పై 30 పైసలు వసూలు చేయాలని డ్రాఫ్ట్‌ ఫైల్‌లో డిస్కంలు పేర్కొన్నాయి. ఈ ఛార్జీల వల్ల విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.22000 కోట్ల వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ కూడా ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఏ కోసం ప్రత్యేక అకౌంట్‌ మెయింటెన్‌ చేయాలని సూచించింది. నెలవారీగా ఖాతా వివరాలను సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. డిస్కంల ప్రతిపాదనకు %ుూజుRజ% ఆమోదం తెలపగా.. ప్రభుత్వం కూడా ఆమోదించలేదు.విద్యుత్‌ సంస్థలు అప్పుల భారంతో కట్టుమిట్టాడుతుండటంతో.. ప్రభుత్వం కూడా టీఎస్‌ఈర్సీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుల భారం నుంచి తమను బయటపడేసేందుకు సబ్సిడీలు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే అన్ని డిస్కంలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం సాయం కోసం వేచి చూస్తున్నాయి. దీంతో విద్యాత్‌ ఛార్జీలలో ఎఫ్‌సీఏ వసూలు చేసేందుకు అంగీకారం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img