Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణ హౌసింగ్‌ బోర్డు రద్దు..

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖను ఇక మీదట అవసరం లేదని భావిస్తూ రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను రహదారులు- భవనాల శాఖలో విలీనం చేసింది. గృహనిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్‌అండ్‌బీ శాఖకు బదలీ చేసింది. పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్షప్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ తాజా నిర్ణయంతో కనుమరుగు కానున్నది. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిత్వ శాఖలు 17కే పరిమితం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాఖల విలీనం గతంలోనే ప్ర భుత్వం దృష్టికి వచ్చింది. ఈ కోవలో ఒకే తరహా పనితీరు ఉన్న శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రక్రియ కొంత జరి గింది. కొత్తగా ముఖ్యమైన శాఖలను కొనసాగిస్తూ మిగతా వాటిని విలీనం లేదా రద్దు చేయాలనే అంశం తెరపైకి వచ్చి ంది. ఈ నేపథ్యంలోనే గృహనిర్మాణ శాఖ రద్దు జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img