Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దంచి కొట్టిన వర్షం.. మిర్చి, వరి పంటలకు అపారనష్టం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురవడంతో అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూల్ నగరం తో సహా ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల, ఓర్వకల్లు, సి బెళగల్, నంద్యాల పరిధిలోని కొలుముగుండ్ల, క్రిష్ణగిరి, మహానంది, సున్నిపెంట మండలాల్లో భారీగా వర్షం నమోదయింది. ఎమ్మిగనూరులో అయితే ఏకంగా చెట్లు కూలి ఇళ్లమీద పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలోని పలు వార్డులు వర్షపు నీటితో లోతట్టి ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. కర్నూల్ లోని కల్లూరు ఎస్టేట్ కాలనీ, గాంధీనగర్, ఎన్ ఆర్ పేట, గాయత్రి ఎస్టేట్, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో జలమయంగా మారాయి. బేతంచర్ల, బనగానపల్లెలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం దాటికీ పలుచోట్ల కళ్లెంలో దాచిన ధాన్యం, ఆరబెట్టిన మిరప, ఇతర పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img