Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్‌-తిరుపతి (02764) రైలు అక్టోబర్‌ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 2న (02763) సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి 3న ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌ (07233) రైలు అక్టోబర్‌ 6, 13, 20 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 9.45కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07234) ఈనెల 30, అక్టోబర్‌ 7, 14, 21 తేదీల్లో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 3.50కి బయల్దేరి తెల్లారి సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.నర్సాపూర్‌-సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడిరచారు. నరసాపూర్‌-సికింద్రాబాద్‌ (నంబర్‌ 07466) రైలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ (నంబర్‌ 07467) రైలు అక్టోబర్‌ 1వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ స్టేషన్‌కు చేరుతుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img