Friday, April 19, 2024
Friday, April 19, 2024

దాసరి అరుణ్‌పై ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు

దర్శకనిర్మాత, దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. మద్యంమత్తులో కారును అతివేగంగా నడపడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాసరి అరుణ్‌ బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్డు 12లోని సయ్యద్‌నగర్‌కు కారులో వెళ్లాడు. ఆ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపక్కన ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడని తెలిపారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు అరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం దాసరి అరుణ్‌కుమార్‌ నేరుగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img