Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం : సీఎం కేసీఆర్‌

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్‌. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌ ఇస్తే స్వరాష్ట్రంలో రూ.3016 పింఛన్‌ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని చెప్పారు.పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్‌తోపాటు మెటీరియల్‌, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడిరచారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img