Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అందులో భాగంగా ఐదు లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెల 3,016 రూపాయలు పింఛన్లు ఇస్తున్నామని, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని దివ్యాంగులకు అవసరమైన వీల్‌ చైర్లు, చేతి కర్రలు, త్రీ వీలర్‌ స్కూటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. దీనికి తోడుగా దివ్యాంగులకు అత్యాధునిక డిజిటల్‌ పరికరాలు, సబ్సిడీపై రుణాలు, విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ లాప్‌ టాప్‌ లు, ఒక కోటి రూపాయల తో దివ్యాంగ విద్యార్థులకు ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు, నిరుద్యోగ దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ధి వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img