Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అని పేర్కొన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్వింటాల్‌కు రూ. 2,060గా నిర్ణయించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన డబ్బులు రాకున్నా.. తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొంటుందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదన్నారు. వడ్లు కొనమంటే బీజేపీకి చేతకాదు కానీ.. రూ. 100ల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటోందని మండిపడ్డారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఈ సాగు లాభదాయకంగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img