Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధరణి పోర్టల్‌తో ఎంతోమంది భూములు కోల్పోతున్నారు : రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం మూడో టీఎంసీ, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మకు భూములు త్యాగం చేసిన రైతులనే రిజనల్‌ రింగ్‌ రోడ్డు పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కోట్లు పలికే ఎకరా భూమికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామనడంపై ఆయన మండిపడ్డారు. ఎస్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ ఆధ్వర్యంలో 25 మందితో కూడిన బృందం 600 కిలోమీటర్ల మేర సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. భూదాన్‌పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌ వరకు చేపడుతున్న ఈ యాత్ర మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించింది. వీరికి మద్దతుగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇవాళ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాళ్లకల్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధరణి పోర్టల్‌ ద్వారా ఎంతోమంది భూములు కోల్పోతున్నారన్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మించారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img