Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధర్మమే జయిస్తుంది

. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
. బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ లేఖ

విశాలాంధ్ర`హైదరాబాద్‌: తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ ను ఎప్పుడూ వదలుకోదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. సోమవారంనాడు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, దుష్ప్రచారాలను అప్రమత్తతో తిప్పికొట్టాలని కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ శ్రేణులను కోరారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఆయన ఆత్మీయ సందేశం ఇచ్చారు. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. తెలంగాణ చిల్లర మల్లర రాజకీ యశక్తులను ఎప్పుడూ కూడా ఆదరించదన్నారు. లక్షల కుట్రలను చేధించి గెలిచిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని ఆయన గుర్తు చేశారు. నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పడిరదని బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా కేంద్రం అడ్డుకుంటుందని కేసీఆర్‌ విమర్శించారు. ప్రజల ఆశీర్వాదం… నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టిందన్నారు. ఉద్యమ వీరులుగా ఆనాడు…నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే..! మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది. బీఆర్‌ఎస్‌… పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని.. ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ అంటూ కేసీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img