Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మరో ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా తెలంగాణ నుంచి కేంద్రం సేకరించనుంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 46 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది. దాంతో కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరిధాన్యాన్నిరాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రుల బృందం దిల్లీ వెళ్లింది. ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ప్రయత్నించింది.ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది మోడీ సర్కార్‌. తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img