Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధాన్యం సేకరణపై లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

న్యూఢల్లీి: ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటం కొనసాగుతున్నది. రెండో విడుత బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశంపై చర్చించాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img