Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యభర్తల వివాదంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కారించారని కోర్టు అభిప్రాయపడి తీర్పు వెల్లడిరచింది. తెలంగాణకు చెందిన నలుగురు పోలీసు అధికారులకు శిక్ష విధించింది హైకోర్టు. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగంపై విచారణ చేపట్టి శిక్ష విధించింది. నలుగురు పోలీస్‌ అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. జాయింట్‌ సీపీ శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేశ్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడిరచింది. ఈ నలుగురికి జైలు శిక్ష విధించడమే కాకుండా శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా హైదరాబాద్‌ సీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పీలుకు సమయం కావాలన్ని అధికారుల తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు కాస్త ఊరట కల్పించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా ఆరు వారాల పాటు శిక్షళలు నిలివేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img