Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువనుంచి 1,17,705 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేమొత్తంలో నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.30 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్ట్‌ గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ఇప్పుడు 309.95 టీఎంసీలుగా ఉంది. కుడి కాలువకు 10,800 క్యూసెక్కులు, ఎడవ కాలువకు 6791 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,698 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img