Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నా నాయకుడు.. నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఆయన తనయుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, కుమార్తె ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‘నా నాయకుడు.. నా తండ్రి.. అని’ గర్వంగా పిలుచుకుంటానని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందరిని ముందుకు నడిపిస్తారని అన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు ఉందని పేర్కొన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img