Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిధుల దారి మళ్లింపు పూర్తిగా సత్యదూరం


ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌
రాష్ట్రంలో పంచాయతీ నిధుల మళ్లీంపు అనేది పూర్తిగా సత్యదూరమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుబట్టారు.పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. శాసనసభలో సభ్యుల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదన్నారు. దేశంలోనే తెలంగాణ సర్పంచ్‌లు అత్యంత గర్వంగా తలెత్తుకునేలా చేశామని అన్నారు. తెలంగాణలోని గ్రామాలను చూసి పొరుగురాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్‌ కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చిందన్నారు. కరోనా లాంటి ఇతర సందర్భాల్లో డబ్బులకు ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే శాసనసభ్యులు, మినిస్టర్ల జీతాలు ఆపేసి అయినా పంచాయతీలకు నిధులు ఇవ్వాలని ఆర్థిక, పంచాయతీరాజ్‌ కార్యదర్శులను ఆదేశించా..గ్రామాల రూపురేఖలు మరుస్తున్నాం అని అన్నారు. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్పగలుగుతాం. మన ఇద్దరి కన్న అద్భుతంగా ప్రజలు గమనిస్తారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లు బాధ పడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నారు. గర్వపడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img