Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు.. తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయని.. వీటిని వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేసేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక, మరో 11,103 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 80,039 వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అన్నారు. వీటిలో విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఉంటుందని వెల్లడిరచారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్‌ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్‌ తెలిపారు.‘‘తెలంగాణలోని ఉద్యోగులకి ఇప్పుడు అత్యధిక జీతం అందుతోంది. తెలంగాణకే చాలా తక్కువ అప్పులు ఉన్నాయి. మేం కడుపుకట్టుకోని, నోరు కట్టుకొని అవినీతి రహితంగా పని చేస్తున్నం. రాబోయే రోజుల్లో షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10 వివాదం కూడా ఏపీతో పరిష్కారం అయితే మనకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అవి కాకుండా తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి ఈ రోజు నుంచి నోటిఫై చేసేస్తారు.’’ అని కేసీఆర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img