Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిరుద్యోగ భృతి ఏమైంది ? : జీవన్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. బిస్వాల్‌ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి క్యాలండర్‌ ఏడాది వెనకబడిరదన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు నెట్టి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారని అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, అదనపు జిల్లాలతో అదనపు ఉద్యోగాలు ఎందుకు క్రియేట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు, రిటైర్‌మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమా? అన్నారు. కేవలం 13 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఇంత ఆర్భాటమా?.. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. స్థానికత పట్ల చిత్తుశుద్ధి ఉంటే ప్రైవేట్‌లో కూడా స్థానికులకే అవకాశం దక్కేలా చూడాలన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ప్రకటించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img