Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిరుద్యోగ యువతపై అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులకు పాల్పడటం సరికాదు

: మంత్రి హరీశ్‌రావు

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరుద్యోగ యువతపై బీజేపీ అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులకు పాల్పడటం సరికాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంథనిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, బీజేపీ అన్యాయాలను ఈ దేశ యువత సహించలేకపోతుందన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకుంటోందని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధిని కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img