Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటితో ముగియనున్న మేడారం జాతర..

ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఆదివాసీ పూజారులు ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు. మరోవైపు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, ఈ నాలుగు రోజులు అమ్మవార్లను దర్శించుకున్న భక్త జనమంతా కలిపి ఇప్పటి వరకు కోటి మందికిపైగా దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్‌ మేడారం టూర్‌ రద్దయింది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు అమ్మవారులకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. జనంలోకి వచ్చిన వనదేవతలు, మళ్లీ వనంలోకి వెళ్లేవరకు రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img