Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ : మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడిరచారు.ఈ మేరకు మంత్రి ఒక ప్రకటనను విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్‌ మాడిఫికేషన్‌ వల్ల రేషన్‌ పంపిణీలో కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పదికిలోల బియ్యం, రెండునెలల పాటు రూ. 1500లు ఉచితంగా తెలంగాణ అందించిందని గుర్తు చేశారు.కేంద్రం ఇవ్వని 92 లక్షల మందికి సైతం ఉచితంగా ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నామని వెల్లడిరచారు.గతంలోనే అధనంగా 3 కిలోలు ఇచ్చిన నేపథ్యంలో మార్చి వరకూ 5 కిలోల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.ఏప్రిల్‌ నుంచి రేషన్‌దారులకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడిరచారు. ఈ జనవరి నుంచి కేంద్ర నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి సాఫ్ట్‌వేర్‌ మాడిఫికేషన్‌ చేయాల్సి రావడంతో పంపిణీలో జాప్యం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేవలం 54 లక్షల 48 వేల కార్డులకు మాత్రమే రేషన్‌ 5 కిలోల చొప్పున అందిస్తుంటే పేదల కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో 92 లక్షల మందికి సొంతంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి పేదలను నిలువుదోపిడీ చేస్తున్న వారు పేదల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img