Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేటి నుంచే మేడారం మహాజాతర

తెలంగాణ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఇవాళ ప్రారంభమై శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలబై వేల మంది సిబ్బంది ఏర్పట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందని అధికారుల అంచనా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వనదేవతలను దర్శిస్తారు. కాగా మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం జరిగింది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు పూర్తయింది. ఇవాళ సారలమ్మ, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది. 17వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు. ఇదే చాల కీలక ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టమిది . చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img