Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేడు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము..

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. శానికే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబై రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తుంది. ఈ రోజు సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక విమానంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తర్వాత రిఫ్రిస్మెంట్ పూర్తి చేసుకొని అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటారు. రాష్ట్ర‌ప‌తికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి స్వాగతం ప‌ల‌క‌నున్నారు. అనంత‌రం నేరుగా 108 దివ్యసాలు సందర్శిస్తూ.. ఆ తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి వారు మంగళ శాసనాలు ఇస్తారు. ఆ తరువాత డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. అనంతరం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చుసిన తరువాత సందర్శకులని, భక్తులని, దేశ ప్రజలని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించ‌నున్నారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప‌ర్య‌ట‌న‌ జరుగుతుంది. కట్టుదిట్టమైన పోలీసు బలగాల భద్రత ఏర్పాట్ల మధ్య ముచ్చింతలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img