Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేతన్న బీమా పథకం ఈ నెల 7 నుంచి ప్రారంభం: మంత్రి కేటీఆర్‌

రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్న బీమా పథకం’ ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతన్నల కోసం ఈ విధమైన పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన వెల్లడిరచారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు ఈ పథకం కింద బీమాను వర్తింపజేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని కేటీఆర్‌ తెలిపారు. 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హులు. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందించనున్నారు. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నేతన్న బీమా పథకం దోహదపడుతుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img