Friday, April 26, 2024
Friday, April 26, 2024

న్యూ ఇయర్‌ వేడుకలకు కొత్త రూల్స్‌.. పాటించకపోతే కఠిన చర్యలే.. పోలీసుల హెచ్చరిక

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. ఈ సారి కూడా ఎప్పటిలాగే హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే కార్యక్రమాలకు అనుమతి ఉందని, ఆ తర్వాత నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. కఫుల్స్‌ కోసం ప్రత్యేకంగా నిర్వహించే వేడుకలకు మైనర్లను అసలు అనుమతించవద్దని ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే వారి వయస్సును ఎంట్రన్స్‌ల దగ్గర తనిఖీ చేయాలని సూచించారు. న్యూ ఇయర్‌ వేడుకలకు హాజరయ్యే వ్యక్తుల ఐడీ కార్డు కాపీలను ఖచ్చితంగా నిర్వాహకులు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్‌ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈవెంట్‌ నిర్వాహకులు, హోటళ్ల యాజమాన్యాలు, పబ్స్‌, రెస్టారెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్వాహకులతో సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 31న రాత్రి నిర్వహించే వేడుకలపై చర్చ జరిపారు. వేడుకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి ఉందని, ఆ తర్వాత నిర్వహించకూడదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img