Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి

: కే కేశవరావు

రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపకూదన్నారు. పంజాబ్‌ పట్ల ఒకలా.. తెలంగాణా పట్ల ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు అన్నారు. పంటల సేకరణలో కేంద్రం జాతీయ విధానం తీసుకురావాలని డిమాండు చేశారు. సోమవారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో రెండు పంటలు పండుతాయి. రబీలో పండే వరి పంట వాతావరణ పరిస్థితుల వల్ల బాయిల్డ్‌ రైస్‌గా చేసి కేంద్రానికి ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నీరు, విద్యుత్‌, పెట్టుబడి సాయం ఇస్తూ ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట ఉత్పత్తి సామర్థ్యం పెంచాం. 62 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది. ధాన్యం తీసుకోవాలని చెప్తుంటే మీరు ఇంత ధాన్యం ఎలా పండిస్తారు? అని కేంద్రం అంటుంది. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం ఇది. పంటల సేకరణలో జాతీయ విధానం తేవాలి. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలని అన్నారు. కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తాం. రెండు మూడేళ్ల సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్లుతారు. అంతవరకు బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.: కే కేశవరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img