Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంట పొలాల్లో వింత మిషన్‌

వికారాబాద్‌ జిల్లాలో పంట పొలాల్లో వింత శకటం
భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు

వికారాబాద్‌ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని మొగ్గలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత యంత్రం ప్రత్యక్షం అయింది. ఆ యంత్రానికి చుట్టూ కెమెరాలు ఉండి పారాషూట్‌ మాదిరిగా ఉంది. అది చూసిన గ్రామస్తులు దాన్ని వింతగా చూస్తున్నారు. ఆ నోట ఈ నోట పడి చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీ ఎత్తున అక్కడు చేరుకొని దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. గుండ్రంగా, చాలా పెద్దగా ఉన్న వింత శకటం ఎక్కడినుండి వచ్చిందో, ఏంటోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దాని దగ్గరకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థంకాని గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మార్పల్లి ఎమ్మార్వో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఆ వింతశకటం ఎక్కడినుండి వచ్చింది ? ఎలా వచ్చింది ? అది ఏంటి ? అని అధికారులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img