Friday, April 19, 2024
Friday, April 19, 2024

పండుగలా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి కేటీఆర్‌

ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్‌ వేదికగా నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పునర్‌ నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనే అంశం ప్రధానమైనదని తెలిపారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కాకతీయ పాలనా విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టారని తెలిపారు. కాకతీయులు ప్రజల కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని, వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యతని అన్నారు. కాకతీయ పాలనా వైభవం, చారిత్రిక విశిష్టత తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహంను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. కాకతీయ వేడుకలకు అవసరమైన ఆర్ధిక వనరులను ప్రభుత్వం సమాకురుస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామి చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img