Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పట్టుదలతో చదివితే విజయం మీ సొంతం

జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే

విశాలాంధ్ర/రాజన్న సిరిసిల్ల :ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని,పక్కా ప్రణాళికతో,మారిన పరిస్థి తులుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.సోమవారం రోజు సిరిసిల్ల పట్టణంలోని సినారె కళా మందిరంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ,యువకుల కొరకు జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాతో కలసి సందర్శించారు.ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ… మంత్రి వర్యులు కె.తారకరామారావు మార్గదర్శనంలో జిల్లోని నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీస్‌ శాఖ తరువున ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం 63 రోజుల శిక్షణ పూర్తయిందంటే .. మీరు మొదటి మెట్టు ఎక్కినట్టే అని మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిరదన్నారు.ఉచిత శిక్షణను మీరందరూ సరియన విదంగా ఉపయోగించుకొని ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం మాకు ఉందని, మీరు ఉద్యోగాలు సాధించడమే మీరు మాకు ఇచ్చే బహుమతి అని అన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళా మాట్లాడుతూ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తం ఉచిత శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు 63 రోజుల పాటు మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో భోజన వసతి కలపించడం జరిగిందని అన్నారు..ఎవరూ కూడా నిరాశ చెందకుండ కష్టపడి చదవాలని అన్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రయివేటు కానీ, ఇతర ఉద్యోగాలు సాధించేందుకు అన్ని సహకారాలు తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీ లు చంద్రశేఖర్‌,నాగేంద్రచారి,తహసీల్దార్‌ విజెయ్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచే శ్రీనివాస్‌,సి.ఐ లు అనిల్‌ కుమార్‌,ఉపేందర్‌, మోగిలి,వెంకటేష్‌,బన్సీలాల్‌, సర్వర్‌,నవీన్‌ కుమార్‌,ఆర్‌.ఐ లు రజినీకాంత్‌, యాదగిరి, ఎస్‌.ఐ లు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img