Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘పది’ పరీక్షలో థియరీ ప్రశ్నల్లో 50 శాతం చాయిస్‌

పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలకు కూడా థియరీ ప్రశ్నల్లో 50 శాతం చాయిస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు మాత్రం చాయిస్‌ ఉండదు. మే 11 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతంలో 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం సబ్జెక్టుకో పరీక్ష (6 పేపర్లు) మాత్రమే రాయాలి. ఈ ఏడాది కూడా గతేడాది తరహాలోనే 70 శాతం సిలబస్‌నే అమలు చేయనున్నారు. ఇప్పటివరకు 4.81 లక్షల మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లింపునకు మార్చి 14 వరకు గడువు ఉన్నది. కాగా, రెండేండ్ల తర్వాత ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img