Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదు

రేవంత్‌రెడ్డిపై మర్రి ఫైర్‌
తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. రేవంత్‌ దూడుకుపై పెదవి విరుస్తున్న సీనియర్లు.. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయన తీరును ఎండగడుతున్నారు.తాజాగా రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌ రెడ్డే కారణమని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్కం ఠాగూర్‌ రేవంత్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని.. ఏదైనా మాట్లాడితే ఉంటే ఉండు లేదంటే బయటికి పో అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యవహారంలోనూ రేవంత్‌ రెడ్డి తీరు సరిగ్గా లేదని మర్రి శశిధర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీనియర్లను తల గోడకేసి కొడతానని పరుషంగా మాట్లాడినా అధిష్ఠానం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగడం కంటే ఇంట్లో కూర్చోవడం మేలని అనిపిస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి తీరుతో కాంగ్రెస్‌ పార్టీ చాలా నష్టపోతున్నా అధిష్ఠానం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img