Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పార్టీ ప్రతిష్ఠ పెంచేవారికే గుర్తింపు..

డీసీసీ అధ్యక్షుడు చల్ల నర్శింహారెడ్డి

విశాలాంధ్ర`షాద్‌ నగర్‌, రూరల్‌: పార్టీ కోసం పని చేసే వారే నిజమైన నాయకులనీ, అధిష్టానం ఇచ్చిన పిలుపుకు చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీ ప్రతిష్ఠను పెంచే వారికి గుర్తింపు ఉంటుందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్ల నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. షాద్‌ నగర్‌ ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో సీనియర్‌ నేత వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ బలోపేతా నికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీలో విభేదాలు, అంతర్గత కలహాల పట్ల త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ మసలుకోవాలని, లేకుంటే చర్యలు తప్ప వని హెచ్చరించారు. షాద్‌ నగర్‌ వ్యవహారంపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే వారికి నాయకత్వం లభిస్తుందని అలాంటి వ్యక్తి వీర్లపల్లి శంకర్‌ అని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో షాద్‌ నగర్‌ నియోజకవర్గం గుండెకాయ లాంటిదని, ఏ పిలుపునిచ్చినా పెద్ద ఎత్తున భారీ సమీకరణ చేస్తూ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధా నాలను ఎండగడుతూ వీర్లపల్లి ఆధ్వర్యంలో చేప డుతున్న కార్యక్రమాల పట్ల ఆయన అభినందిం చారు. సస్పెన్షన్‌కు గురైన వ్యక్తులను వెంట వేసు కుని తిరగడం పార్టీకి నష్టం కల్గిస్తాయని స్పష్టం చేశారు. వారి వివరాలను టీపీసీసీ చీఫ్‌కు అందజే స్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పున ం్ౖవభవం సంతరించుకుందని పేర్కొన్నారు. గ్రూపు రాజకీయాలు చేస్తే చర్యలు తప్పవన్నారు.
నేడు పెద్ద ఎత్తున ఆందోళన
పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణకై టీపీసీసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కందుకూరు ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు దినం పెట్రో ధరలను పెంచుకుంటూ పోతుందని, ప్రజల నడ్డి విరు స్తోందని పేర్కొన్నారు. నూతన కమిటీ ఏర్పాటు అయ్యాక పార్టీ కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆధ్వర్యంలో మొదటిసారిగా కార్యక్రమం చేపట్టను న్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 5 వేల మందితో జిల్లాస్థాయిలో ఆందోళన నిర్వహిస్తు న్నట్లు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లా డుతూ.. అధిష్టానం ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున కార్యకర్తల సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు బాబర్‌ అలీ ఖాన్‌, జగదీశ్వర్‌, బాలరాజు గౌడ్‌, కృష్ణారెడ్డి, హరినాథ్‌ రెడ్డి, చలివేంద్రం పల్లి రాజు, కొంకళ్ల చెన్నయ్య, శ్రీకాంత్‌ రెడ్డి, అందే మోహన్‌, సయ్యద్‌ ఖదీర్‌, మసూద్‌ ఖాన్‌, ఆశన్న గౌడ్‌, నరసింహ, ముబారక్‌, కుమార్‌ గౌడ్‌, అలీం సఖిబ్‌ , బాదేపల్లి సిద్ధార్థ, చంద్రశేఖర్‌, సత్తయ్య, గూడ వీరేశ్‌, నరసింహ, దాసు, అశోక్‌, ఎండి.రహీం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img