Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల వాయిదా తీర్మానం..వాకౌట్‌

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్‌ఎస్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయకండి.. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. ధాన్యం సేకరణపై చర్చ చేపట్టకపోవడంతో ఉభయసభల నుంచి ఎంపీలు వాకౌట్‌ చేశారు.
.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img