Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పుణ్యక్షేత్రాల దర్శనానికి టీఎస్‌ ఆర్టీసీ ప్యాకేజీ..

కార్తీక మాసంలో శివాలయాల దర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి.. మళ్లీ సురక్షితంగా తిరిగి గమ్యస్థానానికి చేర్చాలని నిర్ణయించింది. కార్తీక మాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో అలియాబాద్‌, వర్గల్‌, కొమురవెల్లి, కీసర, చేర్యాల ఆలయాలను దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ ప్యాకేజీ కింద పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 వసూలు చేయనున్నట్లు వెల్లడిరచింది. సికింద్రాబాద్‌ గురుద్వారా వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర.. తిరిగి రాత్రికి సికింద్రాబాద్‌ లోనే ముగుస్తుంది. ఫుడ్‌, టీ, టిఫిన్స్‌ మొత్తం ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img